- గోరంత దీపం కొండంత వెలుగు
- వెచ్చని సూరీడు పగలంతా వెలుగు
- చల్లని చంద్రన్న రాత్రంతా వెలుగు
- అటలంటే మాకిష్టం
- పాటలంటే మాకిష్టం
- అల్లరి పనులు మాకిష్టం
- అమ్మ ముద్దులు మరీ ఇష్టం
- కోడి వచ్చి గుడ్డు పెట్టె
- తాత వచ్చి తొంగి చూసే
- అవ్వ వచ్చి అట్టు వేసే
- అన్న వచ్చి గుటుక్కున మింగె
- ఒకటి ఒకటి రెండు - వేళకు బడికి రండు
- రెండు ఒకటి మూడు - ఒకరికి ఒకరు తోడు
- మూడు ఒకటి నాలుగు - కలిసి మెలిసి చదువు
- నాలుగు ఒకటి ఐదు - చేతికి వ్రేళ్ళు ఐదు
- దసరా పండుగ వచ్చింది
- పప్పు బెల్లం పంచాము
- పలక బలపం తెచ్చాము
- అ ఆ ఇ ఈ వ్రాసాము
- మల్లెపూవు తెలుగు
- పాలు పెరుగు తెలుపు
- చందమామ తెలుపు
- సన్నజాజి తెలుపు
- క్రిస్మస్ తాత వచ్చాడు
- తలపై తీపి పెట్టాడు
- చేతిలో గంట పట్టాడు
- కానుకలెన్నో పంచాడు
- పచ్చ పచ్చని పనస
- పెద్ద తొనల పనస
- పోషకాల పనస
- తెచ్చెను మానస మన కోసమేనట
MPPS SINGITHAM