Type Here to Get Search Results !

Our Photo Gallery

సాధారణ ఆకస్మిక సెలవు (CASUAL LEAVE)

సాధారణ ఆకస్మిక సెలవు (CASUAL LEAVE)

_team 1 of Annexure VII under FR-85 Rulling(4)_

🌠 సాధారణంగా ఉద్యోగుల అత్యవసర పరిస్థితులలో సెలవులో వెళ్ళుటకు సాధారణ ఆకస్మిక సెలవు (Casual Leave) సెలవు ఉపయోగించుకుంటారు.

🌠 FR-67 ప్రకారం సెలవు అనేది హక్కు కాదు.

🌠 క్యాలెండర్ సం॥లో ఈ సెలవులు 15 రోజుల గరిష్ట పరిమితికి మించరాదు.
*(G.O.Ms.No.52 తేది: 04-02-1981)*

🌠 అయితే మహిళా ఉపాధ్యాయులకు మరో 5 రోజులు అదనంగా ఇస్తారు.
*(G.O.Ms.No.374 తేది:16-03-1996)*

🌠 ఆదివారాలు,ఇతర ప్రభుత్వ సెలవు దినాలు,
ఐచ్చిక సెలవు దినాలు కలిపి మొత్తం విధులకు వరుసగా గైర్హాజరు 10 రోజులకు మించరాదు.
*(G.O.Ms.No.2465 Fin తేది:23-12-1959)*
*(G.O.Ms.No.2094 Fin తేది:22-04-1960)*

🌠 ఆకస్మిక సెలవులను అర్ధజీత,సంపాదిత,జీతనష్టపు సెలవులతో గాని,జాయినింగ్ కాలంతో గాని,వెకేషన్ తో గాని జతపరచరాదు.

🌠 పాఠశాలల్లో లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మిగిలిన సిబ్బంది తప్పనిసరిగా స్కూల్ అసెంబ్లీ కి  హాజరుకావాలి.
*(C&DSE Rc.No.527/E2/97 తేది:16-7-1997)*

🌠 సగం రోజుకు కూడా ఈ సెలవు మంజూరు చేయవచ్చు.అయితే ఒంటిపూట బడుల విషయంలో సాధ్యపడదు.
*(G.O.Ms.No.112 తేది:03-06-1966)*

🌠 ప్రతి కార్యాలయంలో ఉద్యోగుల ఆకస్మిక సెలవులు ఒక రిజిస్టరులో నమోదుచేయాలి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM