Type Here to Get Search Results !

Our Photo Gallery

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం | Glorious SelfGovernance Day - MPPS Singitham

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సింగీతంలో తేదీ:25-02-2023న స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం | Glorious SelfGovernance Day - MPPS Singitham Singitham Village

ఈ సందర్భంగా విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేల పాఠశాల ప్రాంతమంతా కొత్త వన్నెలు సంతరించుకొని పాఠశాల ప్రాంగణమంతా కళకళలాడింది. నిత్యం విద్యా బోధన తో ఉపాధ్యాయులు, పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు నేడు విద్యార్థులు తోటి విద్యార్థులకు విద్యను బోధించడం తో ఆనందించారు. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో సంబంధిత అంశాలపై విద్యా బోధన తోటి విద్యార్థులకు బోధిస్తూ సంతోషించారు.ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. ఈనాటి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.MD ఖాజామియా గారు, ఉపాధ్యాయులు రేష్మ గారు, అరుణ్ జ్యోతి గారు, అవినాష్ గారు మరియు విద్యార్థులు వారు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM