- దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి...
- రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల(ఎస్జీటీ)కు ఈ విద్యాసంవత్సరంలో 34,257 ట్యాబ్‌లను అందించనున్నారు.
- అందుకు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) ఆమోదం తెలిపింది.
- రాష్ట్రంలోని 17,810 బడులకు వాటిని సరఫరా చేస్తామని తాజాగా విడుదల చేసిన తీర్మానాల పత్రంలో పేర్కొంది. ఒక్కో ట్యాబ్ ధర రూ.10 వేలు కాగా.. మొత్తం 34,257 ట్యాబ్‌ల కొనుగోలుకు రూ.34.25 కోట్లు వ్యయం కానుంది. అందులో తమ వాటా కింద 60 శాతం అందజేస్తానని కేంద్రం తెలిపింది.
- విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలకు కనిష్ఠంగా ఒకటి, గరిష్ఠంగా అయిదు వరకు సరఫరా చేస్తారు.
- దేశవ్యాప్తంగా మొత్తం 25 లక్షల మంది ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను అందించాలని కేంద్రం నిర్ణయించింది.
- వీటి ద్వారా విద్యార్థులకు హైబ్రిడ్ విధానంలో బోధన అందించడంతో పాటు వారికి సంబంధించిన సమాచారాన్ని, రికార్డులను, చదువులో పురోగతినీ నమోదు చేయాల్సి ఉంటుంది.
- పాఠశాల వారీగా PAB లో ఆమోదం పొందిన టాబ్లెట్ సంఖ్య తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ ఓపెన్ చేయండి
రాష్ట్రంలో 34,257 మంది ఎస్జీటీలకు ట్యాబ్‌లు
July 15, 2022
0
Tags