ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ప్రతి సంవత్సరం అబ్దుల్ కలాం జయంతి రోజైన అక్టోబర్ 15న నిర్వహించబడుతుంది. 2015లో ఐక్యరాజ్య సమితి అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది.
భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి అయిన ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 2015, జులై 27న మరణించాడు. ఆ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అబ్దుల్ కలామ్ కు ఘన నివాళి అర్పించింది. అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కలాం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నం చేశాడనీ, భారత రాష్ట్రపతిగా ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్యసమితి కొనియాడుతూ అబ్దుల్ కలాం జయంతి రోజైన అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా నిర్ణయించింది.