స్వచ్ఛత ప్రతిజ్ఞ | Swachatha Prathignya
"నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తాను. ప్రతి సంవత్సరం 100 గంటలు/ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రంగా ఉండే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను అశుభ్ర పరచను. వేరే వారినీ పరిసరాల అశుభ్రం చేయనివ్వను. మొట్టమొదటగా నేను నాతో ప్రారంభించి, నా కుటుంబంలో, మా వీధిలో, మా ఊరిలో మరియు నేను పనిచేసే కార్యాలయంలో ఈ కార్యక్రమం మొదలు పెడతాను. ప్రపంచంలో ఏదేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు పరిశుభ్రంగా ఉండటం మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక పోవటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను, వీధి వీధికీ.. వార్డు వార్డుకీ.. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తాను. నేను ఈ రోజు నుండి 100 మంది.. నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు పనిచేసేటట్లు చూస్తాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడగు, మొత్తం భారతదేశాన్ని శుభ్రపర్చడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను.’’