జల సంరక్షణ ప్రతిజ్ఞ
సమస్త జీవకోటి మనుగడకు జలమే ప్రాణాధారము. ప్రతి నీటి చుక్క మన ఆత్మబంధువు. నీటిని పొదుపుగా వాడుదాం. ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పాడుదాం. నీటి సంరక్షణకై ప్రతి ఇంటిలో వర్షపు నీటి నిల్వకై ఒక ఇంకుడు గుంత మరియు రైతు పొలంలో నీటి కుంటలు నిర్మాణం చేపడతాము. చెరువులు, కుంటలు తదితర జలవనరులను కాపాడుదాం. ఆవరణలో, రోడ్ల వెంట, ఖాళీ స్థలములలో, పొలాల గట్ల వెంట మరియు బీడు భూముల్లో చెట్లను పెంచుదాం. పర్యావరణ రక్షణకై నీటిని మరియు చెట్లను పెంచి భావితరాలకు ఆహ్లాదకరమైన ప్రకృతి అందిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.