విద్యార్థుల విధులు - 10 రాజీలేని సూత్రాలు
- ఎన్ని పనులున్నా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే అమ్మానాన్నలు లేపకున్న నిద్రలేస్తాను.
- శారీరక పరిశుభ్రత కోసం ప్రతిరోజు స్నానం చేస్తాను.
- లక్ష పనులున్నా ప్రతిరోజు వేళకు బడికి వెళ్తాను.
- ఎన్ని పనులున్నా ఏ రోజు పాఠాలను ఆరోజే చదువుకుంటాను.
- నా లక్ష్య సాధన కోసం 100% ప్రయత్నిస్తాను.
- ఫలితం కోసం ఎదురు చూడను. భాధపడను. గెలుపు ఓటములు సమానంగా స్వీకరిస్తాను.
- నా సామర్థ్యాన్ని నిరంతరం తెలుసుకుంటూ దానిని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
- నా భవిష్యత్తును నిర్మించుకోవడం నా బాధ్యత అని నమ్మి దాని కోసం శ్రమిస్తాను.
- నేను చదువుతోపాటు ఆటలు, పాటలు, కళలు మొదలగు వాటిలో పురోగమించడానికి కృషిచేస్తాను.
- తోటివారితో కలిసి మెలిసి ఉండడం ద్వారా నేను అభివృద్ధి చెందుతాను, ఇతరుల అభివృద్ధికి తోడ్పడుతాను.