73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల-సింగీతం ఆవరణలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తేదీ:15.ఆగస్టు.2019 నాడు ఉదయం 9:00 గంటలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.ఖాజా మియా గారు పతాకవిష్కరణ గావించడంతో కార్యక్రమం ప్రారంభం అయింది. ఈనాటి ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీ.సంతోష్ పాటిల్ గారు, సింగీతం ఎంపిటిసి శ్రీ.నిరంజన్ గారు, ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ శ్రీ.సిహెచ్. నర్సిములు గారు, యువజన సంఘాల నాయకులు శ్రీ. అనిల్ చారి గారు మరియు శ్రీ.రామకృష్ణ గారు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన సభ కార్యక్రమం వందేమాతరం గేయంతో ప్రారంరంభం అయింది.సభకు హాజరైన అతిధులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు అందించారు. విద్యార్థులు సాంస్కృతిక మరియు ఉపన్యాసాలతో అలరించారు. పాఠశాలలో మైక్ సెట్ లేనందున దానిని గమనించి దానిని వచ్చే గణతంత్ర దినోత్సవం నాటికి పాఠశాలకు అందించేందుకు కృషి చేస్తానని రామకృష్ణ గారు తెలియజేయడం జరిగింది. అన్ని ప్రదర్శనల అనంతరం విద్యార్థులకు బహుమతులు వితరణ చేయడం జరిగింది. దీనితో ఈ కార్యక్రమం ముగింపు పలకడంతో చివరగా జనగణమన గీతంతో ముగింపు చేయడం జరిగింది.
చివరగా విద్యార్థులందరికి అల్పాహారం(ఉదయం 7 గంటలకు అందించడం జరిగింది), అరటి పండు మరియు స్వీట్లు అందించారు.