తెలంగాణ ప్రభుత్వ శాఖపరమైన పరీక్షలు: (Departmental Tests)
💥 G.O.Ms.No.29&30 Edn తేది: 23-06-2010 ప్రకారం
*అప్రయత్న పదోన్నతి పథకం:(AAS)*
🌾 అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం ॥ స్కేలు పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.
🌾 కాని 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ఎటువంటి మినహాయింపు లేదు.
🌾 స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం॥ పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
పదోన్నతులు(PROMOTIONS):
🌾 స్కూల్ అసిస్టెంట్లు,గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
🌾 సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
🌾 50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.
♻ *Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి:*
🌾 ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.
🌾 పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.
*డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?*
🌾 ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.
🌾 అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD రాయితీని ఇవ్వరాదు.
☀తెలంగాణ ప్రభుత్వం Departmental Tests నోటిఫికేషన్ విడుదల చేయాల్సివుంది.