గణిత బోధనకు 10 చిట్కాలు
మీ విద్యార్థులకు గణితాన్ని బోధించడంలో మరిన్ని మేళుకవలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే క్రింది చిట్కాలను పాటించండి . మీ తరగతి గణిత ప్రయోగశాల అవుతుంది.
1.గణితం పై గల వ్యతిరేఖ భావనను తొలగించాలి:
విద్యార్థులలో గణితం పట్ల గల వ్యతిరేఖ భావనను గుర్తించాలి.దానికి గల కారణాలను అడిగి తెలుసుకోవాలి లేదా వాటిని ఒక కాగితం పై రాయమనాలి. వారినుండి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టాలి.వారి కోపానికి,భయానికి గల కారణాన్ని సమర్దిస్తున్నట్లు మాట్లాడుతూ మనపై పాజిటివ్ ఒపీనియన్ ఏర్పరుచుకొనేలా చేసుకోవాలి.ఒక వేళ ఆ భావనకు ఒక ఉపాధ్యాయుడు కారణమయితే ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడు మనతో లేడని అర్థమయ్యేలా వివరించండి.గణితం పై గల వ్యతిరేఖ భావనను తొలగించుటకు గణితానికి సంబంధించిన అనుకూల అంశాలను వివరించండి.తద్వారా గణితం అంటే ఇష్టం లేదు అనే భావన నుండి గణితం నేర్చుకుంటాము అనే భావనను వారిలో కలిగించండి.
2.విద్యార్తులను ప్రశ్నించేలా ప్రోత్సహించండి :
గణితం లో ఒక పద్దతిని వివరించిన తర్వాత దానికి సంబంధించి కనీసం ఒక ఉదాహరణనైన వివరించాలి.ఆ తర్వాత మరిన్ని ఉదాహరణలతో విద్యార్థులు ప్రతిస్పందించేలా చేయాలి. గ్రూప్ గా సమస్యలను సాధించే అవకాశాలను కల్పించాలి.ఒక వేళ సమస్యను సాధించలేకపోతే దానిని బోర్డు పై రాసి మిగిలిన విద్యార్థుల ప్రతిస్పందనను గమనించాలి. సమస్య సాధింపలేక పోవడానికి గల కారణాలను విశ్లేషింప జేయాలి .
3.చక్కని బోర్డు మరియు అందమైన చేతి రాతను ఉపయోగించాలి :
బోర్డు పై చక్కని చేతి రాతను ఉపయోగించడం తో పాటు బోర్డు పై గల ప్రదేశాన్ని 2 నుండి 2.5 feet వెడెల్పు గల భాగాలుగా విభజిస్తూ curly lines తో వేరు చేయాలి. ఈ విధమైన విభజన విద్యార్థులలో నూతన ఆలోచనావిధానాన్ని కలిగిస్తుంది.
4. సరైన రంగులను ఉపయోగించడం :
గణిత బోధనకు బ్లాకు బోర్డు వాడటం కంటే వైట్ మార్కర్ బోర్డ్ వాడటం చాల ఉత్తమం. చివరి బెంచ్ లో కూర్చొన్న విద్యార్థులకు కూడా చక్కగా కనిపించే రంగులను ఉపయోగించాలి. గణిత ఆలోచనా విధానాన్ని ప్రతిభింభించే రంగులను ఉపయోగించాలి. గణిత ఉపాధ్యాయుడిగా మీ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించాలి. విద్యార్థులు ఎక్కువగా confuse అయ్యే విషయాలలో సరైన రంగులు వాడటం ద్వారా వారికి చక్కటి అవగాహన కల్పించవచ్చు.
5. సరైన బోధన సామాగ్రి సమకూర్చుకోవడం:
గణితాన్ని బోధించేటప్పుడు వీలైనంతవరకు బోధన సామాగ్రిని ఉపయోగించడానికి ప్రయత్నిచండి.
ఒక్కోసారి తరగతిలో బోధన జరిగేటప్పుడు వచ్చే ఆలోచనలకనుగునంగా బోధన సామాగ్రిని ఉపయోగించవచ్చు. ప్రతిది గణిత బోధన వనరుగా ఉపయోగపడుతుంది అని గమనించండి. ఉదాహరణకు ఒక సమితి శూన్య సమితిని మూలకంగా కలిగి వుందని తెలియచేయుటకు ఒక water mug లో ఖాళి tea cup ని వుంచి వివరించండి.
6. చక్కటి ప్రోత్సాహకర వాతావరణాన్ని తరగతి గదిలో కల్పించండి:
గణిత బోధనకు తగిన ప్రోత్సాహకర వాతావరణాన్ని కల్పించాలి.అంతే కాని సమస్య సాధనలో విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా చేయకూడదు.ఎందుకంటే కొంతమంది విద్యార్థులు దీనివల్ల గణితానికి దూరమయ్యే అవకాశం ఉంది.దీనికి బదులుగా సమస్యను సాధించేటప్పుడు ఏ ఏ సోపానాలను తీసుకోవాలనే సమాధానాన్ని విద్యార్థులనుండి రాబట్టాలి.
ఏ ఒక్క విద్యార్థిని ప్రత్యేకంగా పిలవకుండా వారిలో భద్రతా భావాన్ని పెంపొందించవచ్చు.
7. విద్యార్థులను హేళన చేయకూడదు:
విద్యార్థి తప్పుగా సమాధానం చెప్పినపుడు ఏకపక్షముగా తిరస్కరించకూడదు. దానికి బదులుగా “ ఓకే , వెరీ గుడ్, నీవు ఆ సమాధానాన్ని ఎలా రాబట్టావు. చాలా మంచి ప్రయత్నం చేసావ్. కాని సరైన సమాధానం కాకపోవచ్చు” వంటి పదాల ద్వారా వారిలో ఆసక్తి పెంచవచ్చు. విద్యార్థి తప్పు సమాధానం చెప్పినప్పుడు క్రింది వాటిని పాటించండి.
i) వారిని హేళన పరచకండి మరియు శిక్షించకండి.
ii) విద్యార్థులలో మీ పట్ల గౌరవ భావం పెంపొందేలా ప్రవర్తించండి.
iii) విద్యార్థుల ఆలోచనలకనుగుణంగా బోధనను మార్చుకుంటూ వుండాలి.
8.అప్పుడప్పుడు తప్పులను కావాలని చేయండి:
గణితాన్ని బోధించేటప్పుడు అప్పుడప్పుడు ఉద్దేశ పూర్వకంగా తప్పులను చేయండి. విద్యార్థులు వాటిని గమనించి తెలిపినపుడు వారిలో కలిగే ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేయండి . అంతే గాక ఎవరు perfect కాదని ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని తెలిసేలా చేయండి. పొరపాట్లు చేసినపుడు వాటిని ఎలా సరి దిద్దుకోవాలో నిజాయితిగా నేర్పండి.
9.వారిలోని అంతర్గత సందేహాలను గుర్తించండి:
గణిత బోధన జరుగుతున్నప్పుడు విద్యార్థి హావ భావాలు మరియు శరీర భాష ద్వారా వారికి అర్దమయిందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. వారి confusion కి గల కారణాలను అన్వేషించండి. తద్వారా వారి సందేహాలను తీర్చండి.
10.గణితం పై విపరీత ఇష్టాన్ని ప్రదర్శించండి:
గణితం లోని ప్రతి చిన్న అంశాన్ని గొప్పగా ఆవిష్కరించండి.తద్వారా గణితం పట్ల మీ ఇష్టాన్ని విద్యార్థుల ముందు ప్రదర్శించండి. ఇది వారిలో గణితం పై ప్రేమను పెంచడానికి దోహదపడుతుంది.