Type Here to Get Search Results !

Our Photo Gallery

ఆచార్య వినోబా భావే | Acharya Vinobha Bhaave

🌸🌸〰〰〰〰〰〰〰〰
ఆచార్య వినోబా భావే జయంతిసందర్భంగా...
〰〰〰〰〰〰〰〰🌸🌸
ఆచార్య వినోబా భావేగా ప్రసిద్ధి చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15,1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు.

జననం:
〰〰వినోబా, మహారాష్ట్రలోని గగోదేలో 1895,  సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ  చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. బాల్యములో ఈయనభగవద్గీత  చదివి స్ఫూర్తి పొందాడు.

ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో  భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలి చ్చాడు. అత్యంత స్ఫూర్తిదా యకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత "టాక్స్ ఆన్ ది గీత " అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది.

సంఘ సంస్కర్త భారతదేశంలోని పల్లెలలో జీవించే సగటుజీవి అనుభవించే కష్ఠాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కౄషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడ భావించారు. ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమైకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం - భూదానోద్యమం. ఈ నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్ధించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే మరో అంశం - గోహత్య విధాన నిర్మూలనం.

ప్రతిభకు పురస్కారాలు:🏆
〰〰〰〰〰〰〰
1958 లో వినోబాకు 'సామాజిక నాయకత్వం'పై భారతీయ రామన్ మెగా సేసే పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం మనదేశానికి గర్వనీయం. 1983 లో భారతరత్న బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు.

వినోబా భావాలు:
〰〰〰〰〰
వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్ర లోని 'పౌనాఋ లో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు.
విప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం;  మానవుల హౄదయాలని, మనస్సులని ఏకీకౄతం చేయడానికే నా కార్యక్రమాలపై దౄష్టి పెట్టడం జరిగింది. ప్రశాంతత అనేది మానసికం, ఆధ్యాత్మకం. ఈ ధోరణులనుంచే మానవుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తాయి. ప్రపంచగమనం వీటిపైనే ఆధారపడింది. జై జగత్! విశ్వానికి విజయం! బీదప్రజల హౄదయాలను సుసంపన్నంగాను, సంపన్నప్రజల హౄదయాలను బీదతనం తోను భగవంతుడు సౄష్టించడం విడ్డూరం, ఆశ్చర్యకరం. ప్రజాశక్తి, ప్రజాబలం సంకల్పంగా సాధించాలి. హింసాయుత, బలవంతపు అధికారిక రాజ్యపాలనం ఆహ్వానించదగ్గది కాదు. ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, నైతినబలంతో సమర్ధించు కోవాలి. పాతపడిన యుద్ధసామగ్రితో కొత్త యుద్ధాలు చేయగలగడం అసాధ్యం. ప్రభుత్వాల తప్పిదాలపై విమర్శించ వలసిన పని నాకు లేదు. మంచి పనులని అనుకున్నవాటిపై నా విమర్శ ఉంటుంది. విప్లవవాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అన్న భావం, భావన ఎన్నటికీ రానీయకూడదు. అహింసా విధానాలపై నిదానధోరణిని అవలబించకూడదు. అహింసామార్గం ద్వారా, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే, కాలయాపన, జాప్యం శతౄవులు అనే అనుకోవాలి. పట్టు ఎంతమాత్రం సడలకూడదు. మెతకదనం, పసలేని, ప్రభావంలేని అహింసావిధానాలను అవలంబించినందువల్ల ప్రస్తుత స్తబ్ధత కొనసాగే ప్రమాదంతోపాటు, పెరుగుదల, అభివౄద్ధి చతికిలబడతాయి. చివరకు పరాజయం, నిరాశ తప్పవు. సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకథోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

మరణం:
ఆచార్య వినోబా భావే 1982, నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, 'సల్లేఖనం' గా భావించగా, కీర్తిశేషులైనారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM