Type Here to Get Search Results !

Our Photo Gallery

Children Rhymes In Telugu

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
Children Rhymes In Telugu |MPPS SINGITHAM

మ్యావ్ మ్యావ్ పిల్లి
పాల కోసం వెళ్లి
వంట గదికి వెళ్లి
తలుపు చాటుకెళ్ళి
మూత తీసి తాగ
మూతి కాలే బాగా
అమ్మ వచ్చి చూచే
నడ్డి విరగగొట్టే.

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం
సోకు చేయ మొదలుపెట్టే సోమవారం
మల్లే పూలు తలకు పెట్టె మంగళవారం
బుగ్గ మీద చుక్క పెట్టె బుధవారం
గళ్ళు గళ్ళు గజ్జె కట్టే గురువారం
చుక్క చుక్క గౌను వేసే శుక్రవారం
చెంగు చెంగున బడికి వెళ్ళే శనివారం

★★★★★★★★★★★★★★★★★★★★★◆◆◆

అందమైన పిల్లిరా
అదిగో ఆచటున్నది
పప్పు బువ్వ తినును
పాలు కూడా త్రాగును
రాత్రి వేటలాడును
ఎలుకలను చంపును
ఎలుక మాంసమంటేను
ఇష్టమగును పిల్లికి

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼--------

ఎండ ఇచ్చేది ఎవరు ?


ఎండ ఇచ్చేది ఎవరు ? సూర్యుడు ! సూర్యుడు !
వాన ఇచ్చేది ఎవరు ? మబ్బులు ! మబ్బులు !
వెన్నెల ఇచ్చేది ఎవరు ? చంద్రుడు ! చంద్రుడు !
గాలి ఇచ్చేది ఎవరు ? ఆకాశం ! ఆకాశం !
ప్రేమ ఇచ్చేది ఎవరు ? అమ్మ – నాన్న – గురువూ.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
చేత వెన్న ముద్ద
చేత వెన్న ముద్ద – చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు – పట్టుదట్టి
సందిట తాయత్తులు – సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణ నిన్ను – చేరి కొలుతు .
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

ఎగిరింది ఎగిరింది – నా గాలి పటం

ఎగిరింది ఎగిరింది – నా గాలి పటం
గాలిలో ఎగిరింది -నా గాలి పటం
పైపైకి ఎగిరింది -నా గాలి పటం
పల్టిలు కొట్టింది – నా గాలి పటం
రంగురంగులదండి – నా గాలి పటం
రాజ్యాలు దాటింది – నా గాలి పటం
మబ్బును తాకింది – నా గాలి పటం
పందెమే గెలిచింది – నా గాలి పటం .

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

చుక్ చుక్ రైలు వస్తోంది

చుక్ చుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగి నాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయ్ తినిపిస్తా
చల్లని పాలు తాగిస్తా .
______________________________________________

కొండమీద చందమామ


కొండమీద చందమామ కూర్చున్నాడు
పండువెన్నెల నేలమీద పారుజల్లాడు
బాలల్లారా పాపల్లారా పారి రండి
నేలమీద వెన్నెలంత ఏరుకోండి
ఏవరికి ఏది కావాలో కోరుకోండి
చివరికి మీ తావుల్లో చేరుకోండి

************************************************
చందమామ రావే జాబిల్లి రావే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే
పైడి గిన్నెలో పాలబువ్వ తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే
తెల్ల మబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెల పానకాలు తేవే
అందాల పాపకు అందిచ్చి పోవే .
************************************************

చిట్టి చీమ చిట్టి చీమ

చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడి కెళ్ళావు ?
చిట్టి పాప పుట్టిన రోజు విందుకెళ్ళాను
విందు కెళ్ళి చిట్టి చీమ ఏం చేశావు ?
చిట్టి పాప బుగ్గ పైన ముద్దు పెట్టాను
ముద్దు పెట్టి చిట్టి చీమ చేశావు ?
పొట్టనిండ పాయసం మెక్కివచ్చాను .
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

చిన్నారి పొన్నారి

చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!
అయ్య రారా! చక్కనయ్య రార!
అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!
అప్ప రారా! కూర్మికుప్ప రార!
రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ
తోట రారా! ముద్దుమూట రార!
ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!
పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!
కన్నకాచి రార! గారాలకూచి రా!
నాన్నరార! చిన్నియన్నరార!
ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు
లాడ రార! కుల్కులాడ రార!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

చిట్టి చిట్టి మిరియాలు

చిట్టి చిట్టి మిరియాలు
చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో బిడ్డపుడితే
అల్లంవారి కుక్క భౌ భౌ మన్నది
చంకలో పాప కేర్ కేర్ మన్నది .
🌾🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

బుజ్జి మేక బుజ్జి మేక


బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివీ ? రాజు గారి తోటలోన మేత కెల్తిని .
రాజు గారి తోటలోన ఏమి చూస్తివి ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తిని !
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా ?
నోరురగా పూల చెట్లు మేసివస్తిని .
మేసివస్తె నిన్ను భటులు ఏమిచేసిరి ?
భటులు వచ్చి నాకాళ్ళు విరుగగొట్టిరి .
కాలు విరిగిన నీవు ఊరుకుంటివా ?
మందుకోసం నేను డాక్టరింటికెల్తిని .
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివి ?
చిక్కనైన తెల్ల పాలు అందిస్తిని .
ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమానికేమిస్తావు ?
గడ్డి తినక ఒకపూట పస్తులుండి తీరుస్తా .
పస్తులుంటే నీకు నీరసం రాదా ?
పాడు పని చేయనింక బుద్దివచ్చెనాకు .
🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦


చిలకలుగాని చిలకల్లారా


చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా
రంగు రంగులా రెక్కలతో
సింగారాలు చిందేరా ?
వన్నెల వన్నెల్ పూల మీద వాలుచున్నారా ?
కన్నుల కన్నుల పండుగ చేస్తూ
కదులుతున్నారా ?
వనమంతా – దినమంతా వసంత శోభలతో
అందాల – ఆనందాల ఆటలాడేరా
చిలకలుగాని చిలకల్లారా
సీతాకోక చిలకల్లారా .
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


వానా వానా వల్లప్పా


వానా వానా వల్లప్పా
వాకిట తిరుగు చెల్లప్పా
వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరగలేను నరసప్పా
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


అవ్వ అంగడి పోయింది


అవ్వ అంగడి పోయింది
తియ్యని బెల్లం తెచ్చింది
గుడాలెన్నో చేసింది
అక్కకు అన్నకు ఇచ్చింది
మిగతావన్నీ దాచింది
మెల్లగ పిల్లి వచ్చింది
తినటం అవ్వ చూసింది
కర్ర పట్టుకొని కొట్టింది .
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


బడికి మనం వెళ్లుదాం


బడికి మనం వెళ్లుదాం
ఆటలెన్నో ఆడుదాం
పదములెన్నో పలుకుదాం
పాటలెన్నో పాడుదాం
అక్షరాలు దిద్దుదాం
అమ్మ ఒడిని చేరుదాం .
🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂🐂

నేతిలో నేరేడుపండు


చిట్లపొట్లకాయ
సీమనెల్లికాయ
గోడపుచ్చకాయ
గొబ్బినెల్లికాయ
అత్తకు పెడితే అల్లం
నే తింటే బెల్లం

కొత్తకుండల్లోని గోధుమల్లారా!
పాలపిడతల్లోని పసిబిడ్డలార!
అమ్మ అమ్మ, నీ బిడ్డపేరేమంటే,
నీళ్లల్లో నిమ్మపండు,
పాలల్లో పనసపండు,
నేతిలో నేరేడుపండు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


ఒప్పులకుప్ప


ఒప్పులకుప్పా,
ఒయ్యారిభామ!

సన్నబియ్యం,
చాయపప్పు;

చిన్నమువ్వ,
సన్నగాజు;

కొబ్బరి కోరు,
బెల్లపచ్చు;

గూట్లో రూపాయి,
నీ మొగుడు సిపాయి;

రోట్లో తవుడు,
నీ మొగు డెవడు?
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

ఏనుగమ్మా ఏనుగు!


ఏనుగమ్మా ఏనుగు!
ఏ ఊరొచ్చింది ఏనుగు?
మా ఊరొచ్చింది ఏనుగు.
ఏం చేసింది ఏనుగు?
మంచినీళ్లు తాగింది ఏనుగు.
ఏనుగు ఏనుగు నల్లన్న,
ఏనుగు కొమ్ములు తెల్లన్న,
ఏనుగుమీద రాముడు
ఎంతో చక్కని దేవుడు!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌿🌱🌱