ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా....తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తేదీ:01.02.2022 నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంగా పాఠశాల కు హాజరు కాబోతున్న మీ అందరికీ కూడా స్వాగతం.. సుస్వాగతం.
ఈ సందర్భంగా ఈ క్రింద సూచించబడిన సూచనలు సలహాలను విధిగా పాటించాల్సిందిగా కోరడమైనది.
1. బస్సు లేదా ఆటోలలో వచ్చేవారు ప్రయాణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండేవిధంగా అనగా తక్కువగా మాట్లాడుతూ, మాస్క్ ధరించి ఉండవలెను.
2. కనీసం రెండు బాటిల్స్ లో మంచి నీటిని తమ వెంట తెచ్చుకోవలెను. ఇట్టి నీటిని ఇతరులతో పంచుకోరాదు.
3. మధ్యాహ్న సమయంలో భోజనము ఇతరులతో పంచు కోరాదు.
4. భోజన సమయంలో చెంచా ను ఉపయోగించడం మంచిది.
5. పాఠశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి
6. చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకున్న తరువాతనే పాఠశాలలోకి ప్రవేశించాలి.
7. పాఠశాలలో గుంపులుగా తిరగడం మరియు మధ్యాహ్న సమయంలో కలిసి భోజనం చేయడం పూర్తిగా నిషిద్ధం.
8. కరచాలనాలకు స్వస్తి పలకండి.
9. నమస్కారం ద్వారా పలకరించండి.
10. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించండి...
11. మీ రూల్ నెంబర్ వారీగా కేటాయించిన గదిలోనే ప్రతిరోజు కూర్చోవాలి.
12. ఆటలకు తాత్కాలిక విరామం ఇవ్వండి.
13. వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.
14. మరుగుదొడ్లను ఉపయోగించిన పిదప చేతులు శుభ్రం చేసుకోండి.
15. ఆనారోగ్య సమస్యలు తలెత్తినా పాఠశాల హెచ్.ఎం./టీచర్లకు మరియు తల్లిదండ్రులకు తెలపండి .
విద్యార్థులకు సూచనలు
1.02.2022 నుండి పాఠశాలలు ప్రారంభం.
1. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి పాఠశాలకు రావాలి. అదనముగా (extra) ఇంకో మాస్క్ వెంట తెచ్చు కోవాలి.
2. మీ బ్యాగ్లో హ్యాండ్ వాష్ ఉండాలి.
3.సానిటైజార్ కూడా దగ్గర ఉండాలి.
4. మీకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి..
5. మధ్యాహ్న భోజనం(MDM) కోసం ప్లేట్ తెచ్చు కోవాలి.
6. పాఠశాలలో, తరగతి గదిలో, ఆట స్థలములో మరియు మధ్యాహ్న భోజన సమయములో ఎక్కడైనా భౌతిక దూరం పాటించాలి.
7. వాటర్ బాటిల్స్ లో త్రాగునీరు తెచ్చుకోవాలి.
8. కర్చీఫ్ తెచ్చుకోవాలి.
9. ఏదైనా వేస్ట్ పొడి గుడ్డ తెచ్చుకొని మీరు కూర్చొనే చోట శుభ్రం చేసుకోవాలి.
10. పైవి అన్ని మనము ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన జాగ్రతలు.
ఇట్లు
ప్రధానోపాధ్యాయులు ZPHS/UPS/PS
ఎప్పటికప్పుడు టీచర్లు ఇచ్చే సూచనలను పాటిస్తూ కరోనా నుండి మనల్ని మనం, మన మిత్రుల్ని మరియు తోటివారిని కాపాడుకుంటూ చక్కటి విజ్ఞానాన్ని అంది. పుచ్చుకుంటారని ఆశిస్తూ.…...
-పై సూచనలు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు పాటించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ...
- MPPS SINGITHAM