ప్రపంచానికి వినూత్న నూతన భారతదేశాన్ని పరిచయం చేయాలన్న బృహత్తర ఆశయంతో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ పనిచేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సంధర్భంగా 2022 నాటికి దేశ రూపురేఖలను సమూలంగా మారుస్తూ సంప్రదాయాలకు విలువ ఇస్తూ ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆత్మ నిర్భర్ భారత్ ను నిర్మించాలన్న కృత నిశ్చయంతో గౌరవ ప్రధానమంత్రి పనిచేస్తున్నారు.
ప్రధానమంత్రి ఆశయ సాధనలో భారతదేశ బొమ్మలు, ఆట వస్తువులు కీలక పాత్రను పోషించనున్నాయి. దీనికోసం భారతదేశంలో తయారవుతున్న వివిధ రకాల బొమ్మలు, ఆటవస్తువులకు తగిన ప్రచారం కల్పించి వీటిని అందరికి పరిచయం చేయవలసిన అవసరం ఉంది.
దీని ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం " భారత దేశ బొమ్మల ప్రదర్శన 2021" ను నిర్వహించాలని నిర్ణయించింది. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 2 వ తేదీ వరకు తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్న ప్రదర్శనలో భారతదేశానికి మాత్రమే సొంతం అయిన వైవిధ్య బొమ్మలు, ఆట వస్తువులు మీ స్క్రీన్ లపై కనిపించడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ ప్రదర్శనలో మీరు బొమ్మలు, ఆటవస్తువులను చూడడమే కాదు వాటిని కొనుగోలు చేయవచ్చును. ఇంతేకాదు ప్రదర్శనలో పాల్గొని వచ్చును. కార్యక్రమాల్లో పాల్గోవచ్చును. వీటి తయారీతో సంబంధం ఉన్నవారితో ప్రత్యక్షంగా మాట్లాడడానికి వీలవుతుంది.
బొమ్మలు, ఆటవస్తువులను వినూత్నంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఆన్ లైన్ లో ' టాయ్‌కాథన్' కు శ్రీకారం చుట్టింది. భారత సంస్కృతి, చరిత్ర, నాగరికత, పురాణాలు, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ వినూత్నంగా బొమ్మలు, ఆటవస్తువుల తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ' టాయ్‌కాథన్'ను నిర్వహించడం జరుగుతోంది. బొమ్మలను అమితంగా ఇష్టపడే పిల్లలు, ఉపాధ్యాయులు, అంకుర సంస్థలు, బొమ్మల ఎగుమతిదారులు, వృత్తి నిపుణుల నుంచి దీనికి అనూహ్య స్పందన లభించింది.
భారత బొమ్మల ప్రదర్శన 2021కి రండి చూడండి. బొమ్మలు, ఆటవస్తువులతో కూడిన నూతన ప్రపంచాన్ని ఆస్వాదించండి.