వేమన పద్యాలకు పేరడీ (కరోన శతకం)
చేతిలోన గ్లోవు చెవిపైకి ఒకమాస్కు
చెంత నెపుడు మంచి శానిటైజు
ఉండి నంత గాని ఊరిని పోబోకు
విశ్వదాభిరామ వినురవేమ
రెండు చేతులెత్తి నిండైన దండంబు
నేర్పు కొలది పెట్టు నీటుగాను
షేకు హ్యాండు అనుచు చేతులన్ కలపకు
విశ్వదాభిరామ వినురవేమ
ఎంత వారలైన ఎదురుపడిన గాని
దూరముండి నవ్వు దరిజేర బోవకు
వారి తుమ్ము దగ్గు వారుణాస్త్రము సుమ్మి
విశ్వదాభిరామ వినురవేమ
ఫ్లాట్లు, కార్లు, సైట్లు బ్యాంకు బాలన్సులున్
ఏవి నిన్నుకావ వెంటరావు
చావుగా కరోన సరస జేరగ నీకు
విశ్వదాభిరామ వినురవేమ
యముని దున్న పోతు అందె గజ్జెల సడులు
చేరు నిన్ కరోన చేరినంత
చెల్లు గడువు నీకు చిత్రగుప్తుడు చెప్పు
విశ్వదాభి రామ వినురవేమ
మందు లేదు దీని బలము గొప్పది చూడు
బాల వృద్ధులకును ప్రాణ భయము
దేహ శుద్ధి ఒకటె దీని నాప గలదు
విశ్వదాభి రామ వినురవేమ
Credits : Respected Writer