జలశక్తి అభియాన్ - జల సంరక్షణ - పాఠశాల కార్యక్రమాల నిర్వహణ గురించి
జిల్లా కలెక్టర్ , డి.ఆర్.డి.ఎ. చైర్మన్ & డి.ఇ.ఓ గారి ఆదేశాల ప్రకారం తేదీ 15. & 16 నతేదీ లలో ప్రతి పాఠశాలలో జల సంరక్షణ కార్యక్రమాలు అమలు పరుచటకు ఈ క్రింది సూచనలు జరిచేయనైనది.
👉 ప్రతి పాఠశాలలో పర్యావరణ క్లబ్ లను ఏర్పాటు చేయాలి.
👉 ఈ క్లబ్ కు ఒక ఉపాధ్యాయులు ( జీవశాస్త్రము/సాంఘిక శాస్త్రం/PET/ఇతర ) నాయకుడిగా ఉండి ప్రతి తరగతి నుండి ఒక ప్రతినిధిని తీసుకోవాలి.
👉 సంఘ సభ్యులు ప్రతి బుధవారం చివరి పీరియడ్ నందు జల సంరక్షణ పై వర్షాకాలం ( జులై నుండి నవంబర్ వరకు ) అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
👉 పాఠశాలలో వాటర్ ట్యాంక్ శుభ్రపరిచి / అవకాశం ఉన్నచోట ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.
పర్యావరణ క్లబ్ ( ఎకో క్లబ్) కార్యక్రమాలు :
▪ నీటి సంరక్షణ & వర్షపు నీటి పొదుపు.
▪ జలవనరుల పునరుద్ధరణ.
▪ బోరుబావులను, ఇంకుడు గుంతలను తిరిగి వినియోగంలోకి తెచ్చుట.
▪ జలవనరుల / నీటి గుంతల ఏర్పాటు.
▪ వన సంరక్షణ / మొక్కల పెంపకం.
👉 పాఠశాల జలసంరక్షణ దినోత్సవం (15.07.2019 ) :-
👉 జిల్లా వ్యాప్తంగా తేదీ.15.07.2019 రోజున " పాఠశాల జల సంరక్షణ దినోత్సవం " ను జరపాలి.
👉 ప్రధానోపాధ్యాయులు / ఇతరులు విద్యార్థుల కు ప్రార్ధన సమయంలో దీనిపై అవగహన కల్పించాలి.
👉 15.07.2019 న సాయంత్రం చివరి పీరియడ్ నందు జల సంరక్షణ పై ( వ్యాసరచన లేదా నాటిక ప్రదర్శన ) కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
👉 పాఠశాల ఆవరణలో మానవహారం ఏర్పాటు చేసి జల సంరక్షణ పై నినాదాలు చేయించాలి.
👉 పాఠశాల స్థాయి కార్యక్రమాల ఫోటోలు / వీడియోలు మండల విద్యాధికారి గారికి పంపించాలి.
👉 మండల విద్యాధికారులు MIS Co/CCO ద్వారా వీటిని జిల్లా కలెక్టర్ /డి. ఆర్.డి.ఎ. వెబ్సైట్ నందు అప్లోడ్ చేయుటకు సిద్ధంగా ఉంచుకోవాలి.
👉 15.07.2019 న జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి ర్యాలీ నిర్వహించాలి.
జలశక్తి ప్రతిజ్ఞ
ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకింపచేసే పనులు చేస్తానని, నీటిని వృధా చేయనని, నీటి సంరక్షణకు పాటుపడ్తనని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుతానని, వాటిని భావితరాలకు రక్షిస్తానని అలాగే వాతావరణ, జలావరణ, భూఆవరణ, జీవావరణాన్ని కాపాడుతానని, నా తోటి వారికి ఇట్టి పర్యావరణ, నీటి సంరక్షణ పై అవగాహన కలిగించి చైతన్య పరుస్తానని మనసా,వాచా,కర్మణా ఈ జల శక్తి ప్రతిజ్ఞ చేస్తున్నాను.
Resources/ Manuals
- Jal Shakti Abhiyan Booklet (click here to download)
- Jal Shakti Abhiyan Concept Note ( click here to download)
- poster-1 ( click here to download)
#MPPSSINGITHAM #PSSingitham #Zphssingitham