హరిత పాఠశాల - హరిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా తేదీ.15.జులై.2017 నాడు GREEN DAY నిర్వహించారు.ఉదయం 8:30 నుండి 9:30 వరకు గ్రామంలో విద్యార్థులందరితో కలిసి ఉపాధ్యాయులందరు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో గ్రామ సర్పంచ్,ఎంపీటిసి,విద్యార్థులు,ఉపాద్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు,యువకులు,అధికారులు,విద్యాకమిటి చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల నినాదాలతో గ్రామం మారుమ్రోగింది.
ర్యాలీ నిర్వహించిన తరువాత పాఠశాలల్లో ఉదయం 9:30 నుండి 10:30 వరకు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.విద్యార్థులు,ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు,గ్రామ సర్పంచ్,ఎంపీ.టి.సి,విద్యాకమిటి చైర్మన్లు అందరూ కలిసి మొక్కలు నాటడం జరిగింది.
ఉదయం 10:30 నుండి 12:30 వరకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,చిత్రలేఖన, కథల పోటీలు,పాటల పోటీలు నిర్వహించారు.పాఠశాలల్లో నిర్వహించిన గ్రీన్ డే కార్యక్రమం విజయవంతం అయినందుకు విద్యార్థులు,ఉపాద్యాయులు,తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.