కారుణ్య నియామకాలు కొన్ని ముఖ్య విషయాలు ఉత్తర్వులతో
🔶 పదవ తరగతి కనీస విద్యార్హతలు లేని వ్యక్తిని,విద్యార్హతలు
సంపాదించుటకు అవకాశం కల్పిస్తూ,షరతులతో కూడిన నియామకాలు చేయకూడదు.
(Govt Memo No.3430/Ser.A/97-1 GAD Dt:19-08-1997)
🔶 నిర్దేశిత నియమ నిబంధనల మేరకు కారుణ్య నియామకాలు పొందిన,విధవరాలు,
భార్యా వియోగి ఉద్యోగంలో చేరిన తర్వాత పునర్వివాహం చేసుకున్నప్పటికీ,వారు ఉద్యోగంలో కొనసాగవచ్చు.
*(Govt.Circular.Memo.No.40130/Ser.G/2009-1 GAD Dt:18-06-2010)*
🔶 కారుణ్య నియామకాలలో జూనియర్ పోస్టు కంటే ఎక్కువ జీతం స్కేలు కలిగియున్న టీచరు,ఇంజనీరు,సివిల్ అసిస్టెంట్ సర్జన్ తదితరముల పోస్టులలో అర్హతలు కలిగి ఉన్నప్పటికీ నియమించరాదు.
*(G.O.Ms.No.480 GAD Dt:26-11-2002)*
🔶 వివాహిత కూతురికి ఉద్యోగం కల్పించే విషయంలో మరణించిన ఉద్యోగుకి ఇతరత్రా సంతానం లేనప్పుడు,భార్య ఉద్యోగం చేయడానికి అయిష్టత ప్రకటించిన సందర్భంలో కారుణ్య నియామకం కల్పించవచ్చును.
*(Govt.Memo.No.406/10/A.1/Admn/11/2004 Fin Dt:20-03-2004)*
🔶 కార్యాలయంలో ఉద్యోగాలు ఖాళీలు లేనప్పుడు,కారుణ్య నియామకాలు కల్పించవలసిన అవసరం ఏర్పడినప్పుడు,తాత్కాలిక ప్రాతిపదికన పని చేయుచున్న ఉద్యోగులను తొలగించినవసరం లేదు.అట్టి సందర్భాలలో కారుణ్య నియామకం కోరుచున్న అభ్యర్థి కొంతకాలం ఆగి ఉండాలి.
*(Govt.Memo.No.618/Ser.A/78-11/ GAD Dt:17-12-1979)*
🔶 కారుణ్య నియామకాల పథకం,కేవలం సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది.చనిపోయిన పింఛనుదారుల కుటుంబ సభ్యులకు ఇట్టి పథకం వర్తించదు.
*(Point 7 of Govt.Memo.No.618/Ser.A/79-11 GAD Dt:17-12-!999)*
🔶 సర్వీసులో ఉంటూ ఉద్యోగి చనిపోయిన సందర్భాలలో అతని/ఆమె ,భార్య/భర్త సర్వీసు పెన్షన్ పొందుతున్న సందర్భాలలో కారుణ్య నియామకం కల్పించకూడదు.
(Cir.Memo.No.3548/Ser.G/A2/2010-8 GAD Dt:24-03-2012)