Type Here to Get Search Results !

Our Photo Gallery

కాళోజి నారాయణరావు : Kaloji Narayana Rao Birth Day


జననంరఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-
సెప్టెంబరు 91914
మరణం నవంబరు 132002
ఇతర పేర్లు : కాళోజి ప్రసిద్ధి ప్రజాకవి
భర్త : రుక్మిణిబాయి
పిల్లలు : రవికుమార్
తండ్రి : రంగారావు
తల్లి : రమాబాయమ్మ
తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు (సెప్టెంబరు 91914 - నవంబరు 13,2002). రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు.
జననం
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. కాళోజీ తెలుగుఉర్దూ,హిందీమరాఠీకన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.
ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ,రోహిత్ అటు తరువాత సిటీ కాలేజీ లోనూ,హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.
మాడపాటి హనుమంతరావు , సురవరం ప్రతాపరెడ్డి ,జమలాపురం కేశవరావు , బూర్గుల రామకృష్ణారావు ,పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయంవిద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూరు విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు.
కాళోజి న్యాయవాద విద్య అభ్యసించినా వృత్తి ముందుకు సాగలేదు.కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం. రాజకీయాలు ఆయన ప్రాణం.కాళోజి రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి. తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద.కాళోజీ అసలు పేరు-రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. "నా ఏడవ నెలలో అన్నగారి భుజాలమీద ఎక్కిన నేను నా 80వ ఏట కూడా ఆ భుజాలమీద అట్లనే ఉన్న. ఆయన అట్లనే మోస్తున్నాడు!" అన్నాడు.రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు. ఆంధ్రప్రదేశ్ కావాలని కోరిన కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయాడు.1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది.తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా-కాళోజీ
కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ.
ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి'పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ' --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి1943 లోనే ఆయన కథల్ని కాళోజీ కథలు పేరుతో అప్పట్లో హైదరాబాదు లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావు తో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలనీ అన్నాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నాడు.రెండేళ్లు రాష్ట్ర విధానపరిషత్తు సభ్యుడిగా ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు(1958-60).విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక ఆయన భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని1992 లొ స్వీకరించాడు! అయితే ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు.ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు.ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థపక సభ్యుడు.2002 నవంబరు పదమూడో తేదీన కాళోజీ కన్నుమూశాడు!
నిజాం జమానాల
తెలంగాణ ల నిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు.ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి.సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. గాంధీఅహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు.నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939 ల, 1943 ల రెండుసార్లు జైలుకి పోవాల్సివచ్చింది.
రచనలు
మరాఠీఇంగ్లీషు,ఉర్దూ భాషల్ల పండితుడు.ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగు లకి అనువదించిండు.అణా కథలునా భారతదేశయాత్రపార్థివ వ్యయముకాళోజి కథలునా గొడవజీవన గీతతుదివిజయం మనదితెలంగాణ ఉద్యమ కవితలుఇదీ నా గొడవబాపూ!బాపూ!!బాపూ!!!
తెలంగాణా వాదం
ఆంధ్ర జనసంఘంఆంధ్ర సారస్వత పరిషత్తు,ఆంధ్రమహాసభతెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంల కాళోజి భాగం ఉంది.పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంల, రాజకీయాలల్ల మార్గదర్శనం చేసిండు.విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969 లప్రత్యేక తెలంగాణ ఉద్యమం ల కలిసిండు.అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించిండు. బూటకపు ప్రజాస్వామ్యాన్ని, కోస్తాఆధిపత్యాన్ని వ్యతిరేకించిండు.
ఉల్లేఖన
ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. - కాళోజీ
పురస్కారాలు,సత్కారాలు
★స్వాతంత్ర్యసమరయోధుడిగా భారతప్రభుత్వంచే తామ్రపత్రం
బూర్గుల రామకృష్ణారావు స్మారక ప్రథమ అవార్డు
●భారతప్రభుత్వంచే పద్మవిభూషణ్ పురస్కారం
కాకతీయ విశ్వవిద్యాలయం చే గౌరవ డాక్టరేట్
◆కామినేని ఫౌండేషన్ అవార్డు
★గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు
★MPPS SINGITHAM●

MPPS Singitham

MPPS SINGITHAM