తాపీ ధర్మారావు నాయుడు
(తెలుగు మాధ్యమాల దినోత్సవం)
🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸
(సెప్టెంబర్19,1887- మే 8,1973)
తెలుగు రచయిత, తెలుగు భాషా
పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాం.
జీవిత చరిత్ర:
〰〰〰〰
ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబము లో జన్మించాడు.
ఈయనమాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు.
ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు.
పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.
ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పని చేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట.
కల్లికోటరాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు.
1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది.
కొండెగాడు, సమదర్శిని,జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు.
తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.
జీవితంలో ముఖ్య ఘట్టాలు:
〰〰〰〰〰〰〰〰
1887 - సెప్టెంబర్ 19 జననం - గంజాం జిల్లా, బరంపురం
1903 - మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం
1904 - మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత - విజయ నగరం
1904 - గురజాడను సుదూరంగా దర్శించడం
ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం,
విశేషాలు:
〰〰〰
ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు. 'మాలపిల్ల' (1938) సినిమాకు కథ అందించినది-గుడిపాటి వెంకటచలం.తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.
రచనలు:
〰〰〰
ఆంధ్రులకొక మనవిదేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936 పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు, 1960 ఇనుపకచ్చడాలుసాహిత్య మొర్మొరాలు రాలూ రప్పలూ మబ్బు తెరలు పాతపాళీకొత్తపాళీ , ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ , విజయవిలాసం , వ్యాఖ్యఅక్షరశారద ప్రశంసహృదయోల్లాసము, భావప్రకాశిక
నల్లిపై కారుణ్యము, విలాసార్జునీయముఘంటాన్యాయము అనా కెరినీనాద్యోయానము భిక్షాపాత్రముఆంధ్ర తేజము తప్తాశ్రుకణము
పురస్కారములు:
〰〰〰〰〰
శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.మరెన్నో సాహిత్య పురస్కారములు అందుకున్నారు.
***********************************************
వినయ్ కుమార్
http://vinaysinfo.blogspot.com