🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 〰〰〰〰〰〰〰〰〰
'నీవు వంద మందికి సహాయం చేయలేకపోతే కనీసం ఒకరినైనా ఆదుకో'
--- మదర్ థెరెసా. 〰〰〰〰〰〰〰〰〰
🔸ఐరోపా దేశమైనా అల్బేలియా లో పుట్టి ఇరవై ఏళ్లకే భారతదేశాని కి వచ్చి కోల్‌కతా కేంద్రంగా బడుగు జీవుల సేవలో తరించిన మానవతా మూర్తి మదర్ థెరెసా.
🔸దాతృత్వం అంటే ఏమిటో, అందులో లభించేసంతృత్తి ఎంత అధికమో తెలుసుకోవటానికి ఆమె ప్రత్యక్ష నిదర్శనం. దాతృత్వానికి మించిన గొప్ప కార్యం మరొకటి ఏదీ లేదని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఆమె సొంతం. అందుకే ఆమె పరమపదించిన రోజైన సెప్టెంబరు 5వ తేదీని అంతర్జాతీయ దాతృత్వదినోత్సవం గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనికి హంగరీ దేశంలోని పౌర సమాజం నుంచి వచ్చిన చొరవ ప్రధాన కారణం. అంతర్జాతీయ దాతృత్వ దినోత్స వం అవసరాన్ని, అక్కడి ప్రజల అభిప్రాయాన్ని హంగరీ పార్లమెంటు ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువచ్చింది. దాన్ని సమితి ఆమోదించింది. ఎదుటివారి కి సాయం చేయటంలోని ఔన్నత్యా న్ని సర్వత్రా చాటి చెప్పటం దీని ప్రధాన లక్ష్యం.
🔸పీడిస్తున్న సమస్యలు ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సారధ్యంలో, పలు స్వచ్ఛంద, రాజకీయ, సామాజిక సంస్థల నేతృత్వంలో వివిధ కార్యక్రమాలు చేపడతారు. దాతృత్వంపై ప్రజాచైతన్యాన్ని పెంపొందించటం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. ఎదుటి వారికి చేతనైనంత సహాయం చేయాలనే ధోరణి కొరవడిన ప్రస్తుత సంక్షుభిత ప్రపంచంలో అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం అవసరం ఎంతగానో కనిపిస్తోంది. వివిధ దేశాల మధ్య, విభిన్న వర్గాలు, జాతులు, ప్రాంతాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలు చెలరేగి శాంతి, సామరస్యం ప్రమాదంలో పడిన పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పక్క వారి ప్రమేయాన్ని భరించలేక పోవటం సర్వ సౌకర్యాలు-సంపద తామొక్కరే అనుభవించాలి కానీ ఇతరులతో ఎందుకు పంచుకోవా లనే పెడ ధోరణులు ఎల్లడెలా వ్యాపిస్తున్నాయి. యుద్ధమేఘాలు విస్తరించి మనుగడ కరవై కట్టుబట్ట లతో పశ్చిమాసియా నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్తున్న ప్రజల విషయంలో ఆయా దేశాలు అనుసరిస్తున్న వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తర కొరియా, చైనా అనుసరిస్తున్న విధానాలతో ఆగ్నేయ ఆసియాలో ప్రశాంతత కొరవడింది. తీవ్రవాదం, మత ఛాందసవాదం... ఇప్పటికీ ఈ ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్నా యి. ఎదుటి వారికి చేతనైనన్ త సహాయం చేద్దామనే ఆలోచన లేకపోగా వారి ఉనికిని సైతం సహించలేని వైఖరే దీనికి ప్రధాన కారణం. ఇటువంటి పరిస్థితుల్లో 'ఇవ్వటంలో ఉన్న సంతోషాన్ని' విశ్వవ్యాప్తం చేయాల్సి ఉంది.
🔸ప్రపంచంలో సంపన్నుల సంఖ్య చాలా పరిమితం. ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వర్గాల వారే. ఒక అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో 0.2 శాతం మంది ప్రజల వద్ద ప్రపంచ సంపదలో 34 శాతం ఉంది. అంటే మిగిలిన 99.8 శాతం మంది ప్రజలు 66 శాతం సంపదను పంచుకుంటున్నారు. యునిసెఫ్ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా 240 కోట్ల మంది ప్రజల కు కనీస పారిశుద్ధ్య సదుపాయాలు లేవు. అనారోగ్యంతో ప్రతిరోజూ 16,000 మంది పిల్లలు చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో సుఖసంతోషాలు కొరవడుతున్నా యి. అసమానతలు పెరిగిపోతు న్నాయి. అందువల్ల ఉన్నవారి నుంచి లేనివారికి ఏదోరకమైన సాయాన్ని అందించాలనే ఆలోచ నను అంతర్జాతీయ సమాజంలో విస్తరింపజేయటానికి ఐక్యరాజ్య సమితి సారథ్యంలో చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
🔸తమకు ఉన్న సంపదను ఇతరులతో పంచుకోవటంలో అమెరికా సమాజం ఎంతో ముందు ఉంది. కెనడా, యూకే తదితర దేశాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించటానికి, విద్యా- వైద్య వసతులు పెంపొందించటానికి అమెరికాలోని సంపన్నుల నుంచి సామాన్యుల వరకూ ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని అందజేయటం అనవాయితీ. అంతేగాకుండా తమకు ఉన్న శక్తిసామర్థ్యాలను సైతం ఇందుకు వెచ్చించే పెద్ద మనసు అక్కడి వారి సొంతం. ఇటువంటి ధోరణే ఐరోపా సమాజం లోనూ కనిపిస్తుంది. కెనడా, ఆస్ట్రేలి యా దేశాల్లోని సంపన్నులు, సామాన్యులు తమకు ఉన్నదానిలో ఎంతోకొంత మొత్తాన్ని అణగారిన వర్గాల వారి కోసం కేటాయించటం సర్వసాధారణం. ఎదుటివారికి ఇవ్వటంలో ఎంతో సంతోషం ఉందనే విషయాన్ని తరతరాలుగా అక్కడ ప్రజలు గుర్తించటం దీనికి ప్రధాన కారణం. అమెరికా ప్రజల్లో దాదాపు 70 శాతం మంది ప్రతి ఏటా తమకు ఉన్న దాని నుంచి ఎంతో కొంత మొత్తాన్ని దానం చేయటం అనవాయితీగా వస్తోంది.
🔸ప్రపంచ దేశాలతో పోల్చితే భారతీయుల్లో దాతృత్వం తక్కువ నే విమర్శ ఉంది. కానీ ఇది నిజం కాదు. దాతృత్వంలో కర్ణుడి వారస త్వాన్ని పుణికి పుచ్చుకున్న దేశం ఇది. అనుకోని అతిథికి అన్నం పెట్టి ఆదరించే నైజం భారతీయులది. నిత్యం కష్టాల్లో పుట్టిపెరిగినందున ఇతరులు కూడా అంత కష్టాలు పడరాదని కోరుకుంటారు. కాకపోతే భారతదేశం పేద దేశం. అందువల్ల ఇతర దేశాలతో పోల్చితే భారతీ యులు చేసే దానాలు తక్కువగా కనిపిస్తాయి. అంతర్జాతీయ అధ్య యనాల ప్రకారం చూస్తే భారతీయు లు వార్షిక స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.4 శాతం సొమ్ము దానాలు చేస్తు న్నారు. అమెరికాలో దాదాపు 3 శాతం, యూకేలో 1.5 శాతంతో పోల్చితే ఇది తక్కువే. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
🔸 భారతదేశంలో జనాభా ఎంతో అధికం. ఎన్నో శతాబ్ధాలుగా పరాయి పాలనలో ఉండి వెనుకబడిపోయిన దేశం ఇది. భారతీయ సమాజంలో నిత్యావస రాలు తీరి, ఇప్పుడిప్పుడే ప్రజల వద్ద మిగులు సొమ్ము కనిపించటం మొదలైంది. అందువల్ల ఇక్కడి ప్రజలు చేసే దానాలు చిన్న మొత్తాలుగా కనిపిస్తాయి. అంతేగానీ దానగుణం లేకకాదు. మన దేశంలో ధార్మిక సంస్థలకు, దేవాలయాలకు ప్రజలు పెద్దఎత్తున కానుకలు అందజేయటం, తమ ఆస్తిపాస్తులు రాసి ఇవ్వటం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలం లో విద్యా, వైద్య సంబంధ విషయా లకు దానాలు ఇచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. దేశం అభివృద్ధి చెందేకొద్దీ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, సంపద విస్తరించే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు అధిక మొత్తాలు అణగారిన వర్గాల వారికి దానాల రూపంలో లభించే వీలు ఉంటుంది. అంతెందుకు... తమకు ఉన్న సంపదను ఇతరులకు పంచటంలో అజీమ్ ప్రేమ్‌జీ, రతన్ టాటా వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండటం తెలిసిన విషయమే.
🔸 అంతేగాకుండా మనదేశంలో ఉన్నన్ని స్వచ్ఛంద సంస్థలు ఏ దేశంలోనూ లేవు. దాదాపు 30 లక్షలకు పైగా స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దేశంలో కార్యకలాపా లు సాగిస్తున్నాయి. ఇంటా బయటా ఇవి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
🔸పారదర్శకత అవసరం దానం ఇవ్వటం, ఆ సంస్కృతిని ప్రోత్స హించటం, అవసరంలో ఉన్నవారు తీసుకోవటం బాగానే ఉంది. కానీ ఇచ్చిన నిధులు సక్రమంగా ఉపయోగపడుతున్నాయా? అనేది పెద్ద ప్రశ్న. స్వచ్ఛంద సేవా సంస్థలు వివిధ కారణాలతో నిధులు సేకరించి వాటిని సక్రమంగా వినియోగించటం లేదనే విమర్శలు సర్వత్రా ఉన్నాయి. మనదేశంలోని స్వచ్ఛంద సంస్థలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఈ విమర్శల్లో కొంత నిజం లేకపోలేదు. అలాగని మొత్తం దానగుణాన్నే పరిహరించే పరిస్థితులు కల్పించటం సరికాదు. నిర్మాణాత్మకమైన వైఖరిని అనుస రించటం ద్వారా విమర్శలకు తావివ్వని రీతిలో సేవా కార్యక్రమా లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
🔸ఈ పరిస్థితికి పారదర్శకత, సామాజిక నిఘా సరైన మార్గాలు. స్వచ్ఛంద సంస్థలు తాము సేకరించే నిధుల వివరాలను, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు చేస్తోందీ పారదర్శ కంగా వెల్లడిస్తే అపవాదుకు అవకాశమే ఉండదు. దీనికి పటిష్టమైన విధానాలను, ఆడిట్ పద్ధతులను అనుసరించాలి. మత సంస్థ అయినా, విద్యాసంస్థ అయినా, ఒక వ్యక్తి అయినా, వ్యవ స్థ అయినా నిబద్ధతతో అంతరాలు లేని సమాజాన్ని నిర్మించటంలో భాగస్వామి కావాలి.
🔸కాబట్టి మన దాతృత్వ, దయా గుణాలతో తోటివారికి కొంతైనా సహాయపడగలిగితే మదర్ తెరిస్సా ఆశయాన్ని కొంతైనా నెరవేర్చినవారి మి అవుతామనిఆశిస్తూ.....
ఈనాడు సౌజన్యంతో🌾
...........మీ ప్రాథమిక పాఠశాల సింగీతం🌼🌸
MPPS SINGITHAM