Type Here to Get Search Results !

Our Photo Gallery

తెలుగు భాషా దినోత్సవము: Telugu Language Day

గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ప్రజలు పాటిస్తున్నారు. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మళయాళం)మిగులుతాయని పేర్కొన్నారు.

అ' = అమ్మ అంటే ధర్మము నకు, ఆ = ఆవు ఉంటే (పాడి పంటలు) అర్ధమునకు, ఇ = ఇల్లు (సంసారము)కామము మరియు ఈ = ఈశ్వరుడు (భగవంతుడు)మోక్షము నకు ప్రతీక. ఇటువంటి చక్కని తెలుగు అక్షరాలు అర్థవంతముగా బడిలో గురువులు పిల్లలకు నేర్పిస్తారు.

గిడుగు రామమూర్తి గురించి తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

MPPS Singitham

MPPS SINGITHAM