Type Here to Get Search Results !

Our Photo Gallery

మా బడి

👉మా ఊరి పిల్లలందరూ మా బడిలోనే ఉంటారు. పనిలో ఉండరు.

👉మా పాఠశాలలో ఏ రోజైనా చేర్చుకుంటారు. ఫీజులు అడగరు. సర్టిఫికెట్ల గురించి వత్తిడిచేయరు. మేం క్రమం తప్పకుండా బడికి వస్తాం.

👉మా బడి మా హక్కులను పరిరక్షిస్తుంది.

👉మా వయస్సుకు తగిన తరగతిలోనే మేము చదువుకుంటాం.

👉భయం, ఒత్తిడి లేకుండా పాఠాలు నేర్చుకుంటాం. ఆత్మ విశ్వాసం పెంచుకుంటాం.

👉మా బడిలో మమ్మల్ని దండించరు, దూషించరు. మాకు పాఠాలు ప్రేమతో బోధిస్తారు.

👉మేం ఆనందంగా, ఆహ్లాదంగా, ఆటపాటలతో మా బడిలో గడుపుతాం.

👉సమ వయస్కుల సహకారం, సమన్వయంతో కొనసాగుతాం. మేం నేర్చుకోగలమని మా టీచర్లకు నమ్మకం.

👉మాకు తెలియని విషయాలను ప్రశ్నించి తెలుసుకుంటాం.

👉మేం చదివే తరగతిలో సాధించాల్సిన లక్ష్యాలు సంవత్సరం చివరి వరకు సాధిస్తాం.

👉మా అభిప్రాయాలను మా బడి గౌరవిస్తుంది.

👉మా బడిలో మాకు రుచికరమైన భోజనం పెడతారు.

👉మాకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు.

👉మా పాఠశాల పచ్చదనంతో కళకళలాడుతుంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM